మనదే బిర్యానీ..

 మిగతావన్నీ పలావులే

                       బిర్యానీ పేరు వినిపిస్తే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ గుర్తుకొస్తుంది. ఈ టేస్ట్ ఎన్ని దేశాలు తిరిగినా దొరకదు. హైదరాబాద్లో అడుగుపెట్టిన వాళ్లని ‘మీకేం కావాలి?’ అంటే ‘బిర్యానీ’ అని మనసులోని కోరికను క్షణాల్లో చెబుతరు. ‘గోల్కొండ కోట, అందమైన ప్యాలెస్లను తర్వాత చూద్దాం! ఆ రాయల్ కిచెన్లో పుట్టిన హైదరాబాద్ బిర్యానీని ముందు ఆరగిద్దాం’ అంటారు. గెస్టులను ఖుషీ చేసే ఈ టేస్ట్ మీద ఇప్పుడు లొల్లి మొదలైంది. ‘వరల్డ్ ఫేమస్’ అంటూ ‘హైదరాబాద్ బిర్యానీ’కి ఓవర్ రేట్ ఇచ్చినరంటూ మా బిర్యానీకి ఏం తక్కువంటూ ఎవరో ట్విట్టర్లో కూసినరు. అప్పటి సంది సోషల్ మీడియాలో కూడా బిర్యానీ బ్యాటిల్ కామెంట్లతో కుతకుత ఉడుకుతోంది.

పుణెలో ‘ఏన్షియంట్‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌’ పేరుతో ఒక  రెస్టారెంట్‌ ‌‌‌‌‌‌‌ఉంది. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా ఆ రెస్టారెంట్‌‌‌‌‌‌‌‌ ఎదురుగా ఒక సైన్ బోర్డ్‌‌‌‌‌‌‌‌ పెట్టిన్రు. దానికి  ‘బిర్యానీ పాలసీ’ అని పేరు పెట్టి..‘ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ బిర్యానీ కాకుండా ఇతర బిర్యానీలు అన్ని పొలావ్‌‌‌‌‌‌‌‌లే. బాంబే, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ బిర్యానీలను మటన్‌‌‌‌‌‌‌‌ మసాలా రైస్‌‌‌‌‌‌‌‌’ అని పిలవాలె.  ఆలుగడ్డతో పిలిచే ఏ బిర్యానీ అయినా ఇల్లీగల్‌‌‌‌‌‌‌‌.  ఆలూతో ఏ రైస్‌‌‌‌‌‌‌‌ని మిక్స్‌‌‌‌‌‌‌‌ చేసినా దాన్ని ‘బటాట వడా రైస్’ అని పిలుస్తరు’ అని రాసుకొచ్చిన్రు. ఓ నెటిజన్‌‌‌‌‌‌‌‌ ఈ బోర్డ్‌‌‌‌‌‌‌‌ని ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోస్ట్ చేయడంతో.. ‘చల్‌‌‌‌‌‌‌‌ ఇదెక్కడి కథ.. మాదే అసలు బిర్యానీ, మీది కాదు’ అని కామెంట్లు షురూ చేసిన్రు.

మాదంటే మాది

‘హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ బిర్యానీ -– స్పైసీ మసాల రైస్‌‌‌‌‌‌‌‌. లక్నో, కలకత్తా బిర్యానీలే అసలైన బిర్యానీలు’ అని కొంతమంది ట్వీట్ చేస్తే..  హైదరాబాద్ బిర్యానీ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేటెడ్‌‌‌‌‌‌‌‌ అని, లక్నో బిర్యానీకే  ఆ పొజిషన్ దక్కాలని కొంతమంది రీ ట్వీట్ చేసిన్రు. ఇక శాకాహారులూ తలదూర్చి ‘తలస్సెరీ బిర్యానీ’ టేస్టీ బిర్యానీ అన్నరు! ఇట్ల చానామంది మా బిర్యానీ గొప్పదంటే మా బిర్యానీ గొప్పదని గప్పాలు కొట్టుడు షరూ చేసిన్రు. కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు.. ఏ ఊరోళ్లకు ఆ ఊరు బిర్యానీ ఇష్టంగనే ఉంటది. అందుకే, ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్నరు. అందుకే ఎనకటి వంటకాల్లో లేని ఈ బిర్యానీ ఇక్కడి ఎట్లొచ్చిందో? ఎవలు తెచ్చిన్రో, దీని కథేందో ఓసారి తెలుసుకుందాం.

బిర్యానీ అంటే?..

బిర్యానీ ఎక్కడ పుట్టింది అనేదానికి ఇప్పటివరకు ఖచ్చితమైన ఆధారాలు లేకపోయినా.. దీని మూలాలు మాత్రం పశ్చిమాసియాలో ఉన్నయి. ‘బిర్యానీ’ పర్షియన్‌‌‌‌‌‌‌‌ పదం నుంచి వచ్చినది.  బిర్యాన్ అంటే ‘ఉడికించడానికి ముందు ఫ్రై చేయడం’ అని అర్థం. బిరింజి అంటే ‘రైస్’ అని అర్థం. 1398లో టర్కీ వాళ్లకు, మంగోలియన్స్‌‌‌‌‌‌‌‌కి మధ్య జరిగిన యుద్ధాల్లో సైనికులకు బిర్యానీ డైట్‌‌‌‌‌‌‌‌గా ఇచ్చినట్టు ఆధారం ఉంది. ఇది బలవర్దకమైన ఆహారం కాబట్టి సైనికుల కోసం తయారు చేసినరని అంటున్నరు. టర్కీ యుద్ధం తర్వాత చాలామంది రాజులు యుద్ధ సమయంలో బిర్యానీని సైనికులకు వండించి, వడ్డిస్తూ వచ్చినరు.

మొఘలులు తీసుకొచ్చారట

బిర్యానీని మన దేశానికి తీసుకొచ్చింది మొఘల్ చక్రవర్తులే. ఆఫ్ఘనిస్తాన్‌‌‌‌‌‌‌‌ మీదుగా వచ్చిన మొఘలులు.. వస్తూ ఆఫ్ఘాన్ స్పైసెస్‌‌‌‌‌‌‌‌ తీసుకొచ్చినరు. ముందుగా వాటితోనే  బిర్యానీ చేసేవాళ్లు. తర్వాతి కాలంలో మన దేశంలో లభించే స్పైసెస్‌‌‌‌‌‌‌‌తో బిర్యానీ వండటం మొదలు పెట్టినరు. మొఘల్స్ రాయల్ కిచెన్‌‌‌‌‌‌‌‌లో రోజూ బిర్యానీ ఘుమఘుమలు పొగలు కక్కేటివి. కలకత్తా, లక్నో బిర్యానీల్లో.. మొఘలుల బిర్యానీ తాలూకు మూలాలు ఉన్నయి. టిప్పు సుల్తాన్ వెజిటేరియన్ హిందూ చెఫ్‌‌‌‌‌‌‌‌ని తన ఆస్థానంలో పెట్టుకోవడం వల్ల.. తహ్రాయి వెజిటేబుల్ బిర్యానీ తయారైంది.

రాయల్ కిచెన్ టు రెస్టారెంట్స్

రాయల్ కిచెన్స్‌‌‌‌‌‌‌‌లో రాజులకు ఇష్టమైన ఫుడ్‌‌‌‌‌‌‌‌ ఎప్పుడూ పొయ్యి మీద ఘుమఘుమలాడుతూనే ఉండేది.  అలాంటి వాటిలో బిర్యానీ కూడా ఒకటి. వందల ఏళ్లు బిర్యానీ రాయల్‌‌‌‌‌‌‌‌ ఫుడ్‌‌‌‌‌‌‌‌గానే  కిచెన్ని ఏలింది. పూర్వం రాయల్‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీ, ధనవంతులే బిర్యానీ తినేవాళ్లు. రాచరికం పోవడంతో నెమ్మదిగా ఆ బిర్యానీ.. రాయల్ కిచెన్స్‌‌‌‌‌‌‌‌ దాటి రెస్టారెంట్స్‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెట్టింది.

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ బిర్యానీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఏ గల్లీలో నడిచినా బిర్యానీ ఘుమఘుమలే ముక్కుపుటల్ని తాకుతయి. హైదరాబాద్ బిర్యానీ తినలేదంటే.. జీవితంలో మంచి టేస్ట్ మిస్ అయినట్టేనని ఫుడీస్‌‌‌‌‌‌‌‌ అంటరు. ఈ బిర్యానీ కోసం వాడే మిర్చి, మసాలా, ఇతర స్పైసెస్‌‌‌‌‌‌‌‌చాలా ప్రత్యేకం. వండే తీరు కూడా ఇతర బిర్యానీల కంటే డిఫరెంట్‌‌‌‌‌‌‌‌గా ఉంటది. ‘హైదరాబాద్ బిర్యానీ’ అని వరల్డ్ ఫేమస్‌‌‌‌‌‌‌‌ కావడానికి ఇదే కారణం. బిర్యానీ ఇక్కడ పుట్టిందనడానికి ఆధారాలు లేవని హైదరాబాద్‌ బిర్యానీకి జీఐ ట్యాగ్ ఇవ్వడానికి మూడేళ్ల కింద నిరాకరించినరు. బిర్యానీ ఎక్కడ పుట్టినా..మరచిపోలేనంత రుచిగా హైదరాబాద్లోనే మారింది! బిర్యానీ అంటే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌! హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ అంటే బిర్యానీ!

Latest Updates