మనసును గాయపరిచి వెళ్లిపోయింది : రజనీ, కమల్

polశ్రీదేవి మృతి తనను షాక్ కు గురి చేసిందన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. శ్రీదేవి మరణ వార్త తనను చాలా డిస్ట్రబ్ చేసిందన్నారు. వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని, సినీ పరిశ్రమ నిజమైన లెజెండ్ ను కోల్పోయిందని, ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. ఆమె కుటుంబసభ్యులు పడుతున్న భాధను అర్ధం చేసుకోగలనని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని రజనీ ట్వీట్ చేశారు.

చిన్న నటి స్ధాయి నుంచి పెద్ద నటిగా ఎదిగిన శ్రీదేవిని తన కళ్లతో చూసానని, ఆమె స్టార్ డమ్ కు అర్హురాలని, ఆమె మరణవార్త తనను గాయపరిచిందని, చివరిసారిగా ఆమెన కలసిన క్షణాలు మనసులో మెదులుతున్నాయన్నారు. అందరం ఆమెను మిస్ అయ్యామని కమల్ హాసన్ ట్వీట్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates