మనీషా మార్పు : క్యాన్సర్ తో పోరాడి.. ఆధ్యాత్మిక జీవనంలోకి

నటి మనీషా కోయిరాల కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ తో బాధపడుతూ..ఇప్పుడిప్పుడే ఆ మహమ్మారి నుంచి బయట పడ్డారు. మనిషి చనిపోతున్నాడని తెలిశాక.. జీవితం విలువ తెలిసిందంటున్నారు. ప్రశాంతమైన వాతావణం కోసం..ఆమె ఇప్పుడు ఆధ్యాత్మిక బాటలో పయనిస్తున్నారామె. మహాశివుణ్ణి దర్శించుకోవడం కోసం ఇటీవల ఇదిగో… ఇలా సంప్రదాయ వస్త్రధారణలో వారణాసి వెళ్లారు. అక్కడి మీడియాతో మాట్లడిన మనీషా..బతికున్నంతకాలం ప్రజలందరూ సంతోషంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు. సంప్రదాయ వస్త్రధారణలో వారణాసి వెళ్లిన ఫోటోలను తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు మనీషా. పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు ఫ్యాన్స్. తెలుగులో నాగార్జున సరసన ‘క్రిమినల్‌’లో నటించిన మనీషా కోయిరాలా ..బొంబాయి, ఒకే ఒక్కడు లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates