మనీ గేమ్స్ : జూడో సర్టిఫికెట్లనూ అమ్మేశారు

స్పోర్ట్స్ కోటా కింద మెడికల్ సీట్ల కేటాయింపు కేసులో విచారణ వేగవంతం చేసింది ACB. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈ కేసులో స్పోర్ట్స్అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణ, సభ్యురాలు శోభ సహా మరో నలుగురు ఇళ్ళలో సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. జూడో స్పోర్ట్స్ కోటాపై ఫోకస్ పెట్టారు. వరంగల్ జిల్లాకు చెందిన తోట సునీల్ కుమార్ దగ్గర మెడికల్ సీటు ఇప్పిస్తామంటూ జూడో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కైలాసం రూ.4 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు బాధితుడు ఏసీబీకి తెలిపారు.

కుమారుడి మెడికల్ సీటు కోసం మొదట రూ.2లక్షలు చెల్లించినట్లు సునీల్ కుమార్ చెప్పారు. మెడికల్ సీట్ల కుంభకోణం వెలుగు చూడటంతో కైలాసంపై ఫిర్యాదు చేశారు బాధితుడు. దీంతో వరంగల్ లోని కైలాసం ఇళ్లు సహా హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లోని జూడో అసోసియేషన్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. తనిఖీల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు.

Posted in Uncategorized

Latest Updates