మనీ లాండరింగ్ కేసు.. రాబర్ట్ వాద్రా సన్నిహితుల ఇళ్లలో ఈడీ తనిఖీలు

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా సన్నిహితుల ఆస్తులపై ఈడీ తనిఖీలు చేస్తుంది. వాద్రా కంపెనీలోని ఉద్యోగుల కు చెందిన వారిని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు పొద్దున 11 గంటల నుండి తనికీలు చేపట్టారు.ఈ విషయంపై రాబర్ట్ వాద్రా లాయర్ మీడియాతో మాట్లాడారు. ‘‘ వారు మా వాళ్లను స్కైలైట్‌ హాస్పిటాలిటీ లోపల బంధించారు. ఎవరినీ లోపలకు వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వడంలేదు. ఇదేమైనా జైలా. ఇలాంటి చర్యలు నాలుగున్నరేళ్లుగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు వారు ఏమీ కనుక్కోలేకపోయారు. ఇప్పడు మమ్మల్ని బయట ఉంచి ఆధారాలను తారుమారు చేస్తున్నారు’’ అని అన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates