మనోళ్లు తక్కువోళ్లేంకాదు..! రిషభ్ పంత్ స్లెడ్జింగ్

 ఒకప్పుడు స్లెడ్జింగ్ అంటే కేరాఫ్ ఆస్ట్రేలియా. ఈసారి ఆసీస్ సిరీస్ లో సీన్ మారింది. భారత ఆటగాళ్లే ఆస్ట్రేలియా క్రికెటర్లను స్లెడ్జ్ చేస్తున్నారు. ఓ ఆట ఆడుకుంటున్నారు. అడిలైడ్ వేదికగా ఆసీస్ తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ లో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్లెడ్జింగ్ మొదలుపెట్టాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖవాజా ఏకాగ్రత దెబ్బ తీయడానికి రిషబ్ పంత్ నోటికి పని చెప్పాడు.

అశ్విన్ బౌలింగ్ చేస్తుండగా పంత్ స్లెడ్జింగ్ చేయడం స్టంప్స్ మైక్రోఫోన్‌లో వినిపించింది. ఇక్కడ అందరూ పుజారాలు కాలేరు అని పంత్ అన్నాడు. ఈ ట్రిక్ బాగానే పని చేసింది. ఖవాజా కేవలం 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అశ్విన్ బౌలింగ్‌లోనే పంత్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

పుజారా పేరే ఎందుకు రిషభ్ పంత్ చెప్పాడంటే…?

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో పుజారా మాత్రమే సెంచరీ చేశాడు. టీమిండియా మొత్తం 250 పరుగులు చేసింది. పుజారా టీం మొత్తం చేసిన స్కోరులో సగం అంటే.. 123 పరుగులు చేశాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లకు 191 పరుగులు చేసింది.

Posted in Uncategorized

Latest Updates