మన్ కీ బాత్ : యోగా ప్రపంచాన్ని ఒక్కటి చేసిందన్న మోడీ

GPSయోగా ప్రపంచాన్ని ఒక్కటి చేసిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నింగి, నేల, నీటిపై యోగా చేసిన సైనికులను చూసి 125కోట్ల మంది భారతీయులు చూసి గర్వపడుతున్నారని మన్ కీ బాత్ లో చెప్పారు. భారత్-అఫ్గనిస్తాన్ టెస్ట్ మ్యాచ్ ను ప్రస్తావించారు మోడీ.

యోగా ఆరోగ్య విప్లవంగా రూపుదిద్దుకుంటోదన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ ప్రచారం ఇలాగే కొనసాగితే… మరింతమంది ప్రజలు యోగా చేస్తారన్నారు. రేడియో ప్రోగ్రామ్ మన్ కీ బాత్ 45వ ఎడిషన్ లో మోడీ మాట్లాడారు. భారత సాయుధ బలగాలు ఆకాశంలో, నేల, సముద్రం, సబ్ మరీన్ లలో యోగా చేసిన విషయాన్ని మోడీ ప్రస్తావించారు. దేశ స్వాతంత్ర్య చరిత్రలో రక్తాక్షరాలతో రాయబడిన జలియన్ వాలాభాగ్ దారుణాన్ని మోడీ ప్రస్తావించారు. 2019కు జలియన్ వాలాభాగ్ ఘటన జరిగి 100 ఏళ్లు పూర్తి కానుంది. హింస ఏ సమస్యను పరిష్కరించలేదనే నిజాన్ని జలియన్ వాలాభాగ్ ఘటన తెలియజెప్తుందన్నారు. శాంతి, అహింస, త్యాగం, బలిదానం అంతిమంగా గెలుస్తాయన్నారు.

ఈ మధ్యనే బెంగళూరులో జరిగిన భారత్-ఆఫ్ఘనిస్థాన్ టెస్ట్ మ్యాచ్ గురించి మోడీ మాట్లాడారు. ఇండియన్  కెప్టెన్ రహానే..  ఆఫ్ఘనిస్థాన్ టీమ్ ను ఫోటో దిగడానికి ఆహ్వానించడం మంచి విషయమన్నారు. GST అమల్లోకి వచ్చి సంవత్సరం పూర్తవుతోందని… దాని క్రెడిట్ అంతా రాష్ట్రాలకే ఇచ్చారు మోడీ.

Posted in Uncategorized

Latest Updates