మన డబ్బు ఏమైంది : ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న నగదు

యే-డలత్తెలుగు రాష్ట్రాల్లో నగదు కొరత తీవ్రంగా ఉంది. దీంతో ATMలలో డబ్బులు నింపడానికి 2 నెలలుగా పక్క రాష్ట్రాల నుంచి డబ్బులు వస్తున్నాయి. తెలంగాణాకు మహారాష్ట్ర, కేరళల నుంచి నగదు వస్తుంది. ఆంధ్రప్రదేశ్ కు ఒడిషా, తమిళనాడు రాష్ట్రాల నుంచి వస్తుంది. 3 నెలలుగా నగదు కొరతతో కొన్ని బ్యాంకులు.. ATMసర్వీసులను నిలిపివేశాయి. తెలంగాణాలో SBI బ్యాంక్ కు 2వేల 200 ATMలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 1500 ATMలు మాత్రమే పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఆసరా, నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ పనులు కూడా దీని ప్రభావానికి గురయ్యాయి. తమ పెన్షన్లను తీసుకోవడానికి పోస్టాఫీసులకు బ్యాంకులు డబ్బులు సరఫరాలో ఆలస్యం అవడంతో వారు ఫోస్టాఫీసులకు పదే పదే తిరగవలసి వస్తుంది.

జనవరి, ఫిబ్రవరిలో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకి డబ్బుల బదిలీ జరిగింది. మార్చి నెలలో ఇంకా రాలేదు. మార్చి నెల కావటం, ఇయర్ ఎండ్ అవ్వటంతో మిగతా రాష్ట్రాల నుంచి కూడా డబ్బు తీసుకురావటం కష్టంగా ఉందంటున్నారు తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంక్ అధికారులు. దీంతో ATMలలో డబ్బు నింపటానికి బ్యాంకుల దగ్గర నగదు అందుబాటులో లేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కొరత ఎక్కువ అయ్యింది. దీన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాం అంటున్నాయి బ్యాంకులు.

దీనికితోడు సెప్టెంబర్ 2017 నుంచి RBI ద్వారా సప్లయి చేసిన 2 వేల రూపాయల నోట్లు కస్టమర్ల నుంచి తిరిగి డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు రాకపోవడం కూడా ఓ ప్రధాన కారణంగా ఉంది. దీనితోడు గతంలో ఉద్యోగులు తమ జీతాన్ని విడతలవారీగా డ్రా చేసేవారని.. ఇప్పుడు ఒకేసారి మొత్తం డ్రా చేస్తున్నారని.. నగదు కొరతకి ఇది కూడా ఓ కారణం అని చెబుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates