మన నగరం : జనం బాధ్యత, భాగస్వామ్యం ఉన్నప్పుడే విశ్వనగరం

KTR-Hydభాగ్యనగరంలో మౌలిక వసతులు మెరుగుపరించేందుకు ప్రజల భాగస్వామ్యం మరింత కావాలన్నారు ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్. రాత్రికి రాత్రే విశ్వనగరంగా మారదన్నారు. అందరూ కలిస్తేనే స్వచ్ఛ్ సిటీ సాధ్యమన్నారు మంత్రి. కూకట్ పల్లి నిజాంపేటలో జరిగిన మన నగరం కార్యక్రమానికి సిటీ మేయర్ , మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి హాజరయ్యారు కేటీఆర్. విశ్వనగరం కావాలంటే అన్ని మౌలిక వసతులు ఉండాలన్నారు. మంచి ఆశయం సంప్రదాయంతో జీహెచ్ ఎంసీ మంచి కార్యక్రమం చేపట్టిందన్నారు మంత్రి. వీధి కుక్కలు, దోమల సమస్యను నిర్మూంచాలన్నారు. ప్రజలకు సంతృప్తకర స్థాయిలో మంచినీరు అందిస్తామన్నారు కేటీఆర్.

ప్రభుత్వం, జీహెచ్ఎంసీ మాత్రమే అన్నీ చేయాలంటే కష్టం అన్నారు. ప్రజల నుంచి బాధ్యత, భాగస్వామ్యం ఉన్నప్పుడే విశ్వనగరం అవుతుందన్నారు. రాత్రికి రాత్రి మార్పు రావాలంటే రాదని.. దశల వారీగా స్వచ్ఛ సిటీగా మారుతుందన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేయటంలో హోటల్స్ కూడా చొరవ తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికీ ఇది నా నగరం అనే భావన ఉండాలన్నారు.


Posted in Uncategorized

Latest Updates