మన పథకాలను కాపీ కొట్టినందుకే BJP గెలుపు

TELANGANAతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలను కర్ణటక ఎన్నిల్లో కాపీ కొట్టారని..ఫలితంగా బీజేపీ గెలిచిందన్నారు తెలంగాణ మంత్రులు. గురువారం (మే-17) జయశంకర్ జిల్లా కొంపల్లిలో రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు  డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు పోచారం, చందులాల్, రైతు సమన్వయ సమితి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు.. వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకే.. ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రవేశపెట్టిందన్నారు.

రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను కాపీ కొట్టినందుకే.. కర్నాటకలో బీజేపీకి 104 సీట్లు వచ్చాయన్నారు మంత్రులు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates