మన బ్యాంకులు స్ట్రాంగ్ : నీరవ్ చేసిన మోసం.. మూడు రోజుల వడ్డీ

మలయరత
భారతీయ బ్యాంకులు చాలా పటిష్టంగా ఉన్నాయని.. 1992 హర్షద్ మెహతా కేసులో కూడా తొనకలేదు.. అలాంటిది ఇప్పుడు నీరవ్ మోడీ స్కాం విషయంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు వచ్చిన ముప్పేమీ లేదని భరోసా ఇచ్చారు బాంబే స్టాక్ ఎక్సైంజ్ సీఈవో ఆశిష్ చౌహాన్. అమెరికా దేశం మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లో జరిగిన సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు.

నీరవ్ మోడీ వల్ల ఇండియన్ బ్యాంకులు సంక్షోభంలో పడ్డాయి అన్న ప్రశ్నకి చౌహాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో మూడు రోజులకు వచ్చే వడ్డీనే రూ.10వేల కోట్లు ఉంటుందని.. నీరవ్ మోడీ బ్యాంకులకు ఎగ్గొట్టిన మొత్తం కూడా మూడు రోజుల వడ్డీతో సమానం అన్నారు. దీని వల్ల ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థకు వచ్చిన ముప్పేమీ లేదన్నారు. నీరవ్ దేశం వదిలి పారిపోయిన మాట వాస్తవమే అయినా.. అతని ఆస్తుల జప్తు ద్వారా బ్యాంకులకు తిరిగి ఆ సొమ్మంతా చేరుతుందన్నారు.

భారతదేశం మొత్తం లావాదేవీలు ఒక కోటి కోట్లు అని.. ఒక ఏడాదిలో 12శాతం వడ్డీ లెక్కకట్టినా అది 12 లక్షల కోట్లుగా వడ్డీ ఉంటుందన్నారు. ఈ లెక్కన ఒక నెల రోజులు తీసుకుంటే అది ఒక లక్ష కోట్లు అవుతుందని.. అదే మూడు రోజులకి అయితే 10వేల కోట్ల వడ్డీ అవుతుంది లెక్కలు చెప్పారు. అంటే నీరవ్ మోడీ చేసిన మోసం విలువ.. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థకు వచ్చే వడ్డీ లెక్కల చూసుకుంటేనే మూడు రోజుల సొమ్ము మాత్రమే అన్నారు. దీని వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలు కుప్పకూలిపోవు అని భరోసా ఇచ్చారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశంలోనే రెండో అతిపెద్దదిగా ఉందని.. కార్యకలాపాలకు ఎలాంటి ముప్పు లేదన్నారు. అంటే నీరవ్ మోడీ మోసంతో బ్యాంకింగ్ వ్యవస్థకు వచ్చిన సంక్షోభం ఏమీ లేదు.. అంతా మన భ్రమనే.. ఈ మాట చెప్పింది BSE (బాంబే స్టాక్ ఎక్సేంజ్) సీఈవో అశీష్ చౌహాన్..

Posted in Uncategorized

Latest Updates