మన రోగాలు చెబితే చాలు : ఎప్పుడు చచ్చిపోతావో గూగుల్ చెప్పేస్తోంది

google deathఎటువంటి సమాచారాన్నైనా చిటికెలా అందించే టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మరో అడుగుముందుకేస్తోంది. గుగుల్ లో దొరకనిదంటూ లేదు అనే విధంగా నిపుణులు కొత్త టెక్నాలజీలను తీసుకువస్తున్నారు. ఇప్పుడు మనిషికి  ఉన్నరోగం చెబితే చాలు ఆ వ్యక్తి ఎప్పుడు మరణిస్తాడనే విషయాలు కూడా చెప్పనుంది గూగుల్.

దీనిని త్వరలోను సెర్చ్ ఇంజిన్ లోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది గూగుల్ యాజమాన్యం. అయితే దీర్ఘకాలిక రోగాలైన క్యాన్సర్, ఎయిడ్స్, తలసేమియా లాంటి వ్యాధిగ్రస్తుల వివరాలను వారి బ్లడ్ గ్రూప్ ఆధారంగా వయసు వివరాలను తెలిపితే చాలు ..ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఎంటి..ఎన్ని రోజులు బతకగలడనేది తెలపనుంది. అయితే ఇది సాధ్యమా అనే అనుమానాలు వస్తున్నాయని..ఇప్పటికే కొందరిపై ఈ పరిశోధన చేయగా రిజల్ట్ పాజిటివ్ గా వచ్చిందంటున్నారు గూగుల్ స్టాఫ్.

అంటే డాక్టర్ కూడా చెప్పలేని విషయాలను గూగుల్ చెబుతుందంటే టెక్నాలజీలో మార్పులకు సరికొత్త అధ్యయనం వస్తున్నట్లే అంటున్నారు నిపుణులు. అయితే ఇప్పటికే జాతకం రీత్యా మంచి చెడులు చెబుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో అంచనా వేస్తుందో లేదా..పక్కా మరణించే సమయాన్ని చెబుతుందో లేదో చూడాలంటే ఈ టెక్నాలజీ మనుగడలోకి వచ్చేదాకా ఆగాల్సిందేనని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates