మయాంకా..మజాకా : ఫస్ట్ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ

మెల్ బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సత్తా చాటాడు. టెస్ట్ టీమ్ లోకి అడుగుపెట్టిన మొదటి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ చేసి అదుర్స్ అనిపించాడు. 95 బాల్స్ లో 50 రన్స్ చేశాడు. పుజారాతో కలిసి  జోడీ రెండో వికెట్ కు 83 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు మయాంక్.  అరంగేట్ర టెస్టుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఏడో భారత ఓపెనర్‌ గా మయాంక్‌ గుర్తింపు పొందాడు. మయాంక్‌ కన్నా ముందు ధావన్‌, పృథ్వీషా, గవాస్కర్‌, ఇబ్రహిం, అరుణ్, హుస్సెన్‌ లు ఈ ఘనతను సాధించారు.

54.5 ఓవర్ లో పాట్ కమిన్స్ బౌలింగ్ మయాంక్(76) ఔట్ అయ్యాడు. టీ బ్రేక్ కి 2 వికెట్ల నష్టానికి భారత్ స్కోర్ -123. పుజారా (33), కోహ్లీ(0) రన్స్ తో క్రీజులో ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates