మరక కాదు మార్పు : పరిపూర్ణానంద బహిష్కరణను ఖండించిన కత్తి

ఎస్..ఎస్.. టైటిల్ చూసి షాక్ అయ్యి ఉంటారు.. కానీ అక్షర నిజం. 2017 నవంబర్ ఒకటో తేదీన రాష్ట్రీయ హిందూ సేన సమావేశంలో చేసిన ప్రసంగం మత విద్వేషాలను రెచ్చగొట్టవిధంగా ఉందని నిర్థారించిన పోలీసులు.. ఆయనపైనా హైదరాబాద్ నగర బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు. ఆరు నెలలు సిటీలోకి అడుగుపెట్టొద్దని ఆదేశించారు. ఏపీ రాష్ట్రం కాకినాడలోని శ్రీపీఠంకి తరలించారు. పరిపూర్ణానందను హైదరాబాద్ నగర బహిష్కరణ చేయటంపై స్పందించారు కత్తి మహేష్. ఈ నిర్ణయం సరైంది కాదని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. న్యాయం అందరికీ సమానంగానే ఉండాలని.. అయితే ఇలాంటి నిర్ణయాలను మాత్రం ఆహ్వానించేది లేదని స్పష్టం చేస్తూనే.. తీవ్రంగా ఖండించారు.

పరిపూర్ణానంద నగర బహిష్కరణను ఖండిస్తున్నాను. బహిష్కరణలు ఈ సమస్యకు పరిష్కారం కాదు. బహిష్కరణ ఆధునిక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.మనుషుల్ని “తప్పిస్తే” సమస్యలు తప్పుతాయి అనే ఆటవిక సమాజం దిశగా ప్రభుత్వాలు పయనిస్తే అది తిరోగమనమే అవుతుంది. అంటూ పరిపూర్ణానంద బహిష్కరణను తప్పుబట్టారు. సమన్యాయం విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన మాట వాస్తవమే అయినా.. అప్రజాస్వామికమైన నిర్ణయాలను తీసుకుంటే.. అది మొత్తం సమాజానికే మంచిది కాదంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు కత్తి మహేష్. వ్యవస్థ విధానాలను ఖండించాలన్నారు కత్తి.

ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు తగదన్నారు. మనం ఆటవిక సమాజంలో లేమని పోలీస్ చర్యలపై చురకలు అంటించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఆధునిక సమాజంలోనే దొరకనప్పుడు.. అది ఆటవిట రాజ్యమే అవుతుందని ప్రభుత్వాల తీరును తప్పుబట్టారు. పరిపూర్ణనందపై బహిష్కరణ వేటును ఖండిస్తూనే.. ఎవరిపైనా ఇలాంటి ఆంక్షలు ఉండకూడదు అన్నారు. పరిపూర్ణనంద బహిష్కరణను ఖండించటంతో కత్తి మహేష్ పై నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates