మరణం అంచులదాకా వెళ్లొచ్చాడు : లారీ కింద 2 గంటలు నరకయాతన

lorry
లారీ-బైక్ యాక్సిడెంట్ లో ఓ వ్యక్తి మరణం అంచులదాకా వెళ్లొచ్చాడు. బైక్ తో వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో..ఆ వ్యక్తి బైక్ తో సహా లారీ కిందకు దూసుకెళ్లాడు. అయితే లారీ టైర్లు మట్టిలో ఇరుక్కుపోవడంతో, ఎటువెళ్లలేని పరిస్థితి. బైక్ అమాంతం టైర్ల మధ్యలోకి వెళ్లింది. దీంతో లారీ ఇంచు కదిలిన ఆ వ్యక్తి ప్రాణానికే ప్రమాదం. ఇలా ముందు చూస్తే నుయ్యి..వెనక చూస్తే గొయ్యి అనేలా అతడికి చెప్పరాని కష్టంతో రెండు గంటలు తల్లిదండ్రులను, గ్రామస్ధులను చూస్తూ..రోదిస్తూ నరకయాతన అనుభవించాడు.

వివరాల్లోకెళితే… వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం డీసీతండాకు చెందిన ఆంగోతు వెంకన్న, ఆంగోతు సంతోశ్ బైక్ పై వెళ్తుండగా, బుధవారం (జూన్-27) లారీ ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న వెంకన్న అనూహ్యంగా వాహనంతోసహా లారీ క్యాబిన్‌ కింద ఇరుక్కుపోయాడు. లారీ సైతం మట్టిలో కూరుకుపోయి ఆగిపోయింది. లారీ ఏ మాత్రం కదిలినా వెంకన్న మృత్యువాత పడటం ఖాయం. సమాచారం అందుకున్న సీఐ వేణుచందర్, ఎస్సైలు శ్రీధర్, ఉపేందర్‌ రావు ఘటనస్థలికి చేరుకున్నారు. రెండు పొక్లయిన్లు, క్రేన్ సహాయంతో రెండున్నర గంటలపాటు శ్రమించి వెంకన్నను ప్రాణాలతో బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన సంతోష్ ను  హస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates