మరణ వాగ్మూలం : భార్య, అత్తమామల వేధింపులతో యువకుడు ఆత్మహత్య

sucide
భార్య అంటే ఎంతో ఇష్టం.. ఎంతో ప్రేమించాడు.. భార్యనే సర్వస్వం అనుకున్నాడు.. విషయం ఏదైనా భార్యతోనే పంచుకునే వాడు. అంతేనే అత్తమామలు, బావ మరిదిని కూడా బాగా చూసుకున్నాడు. నా అనుకున్నాడు.. ఏం చేస్తాం.. అనుకోకుండా ఓ రోజు అందరూ ప్లేట్ ఫిరాయించారు. భర్తను కాదని.. అత్తమామలు, అన్నయ్య తరపునే మాట్లాడింది ఆ భార్య. అంతేకాకుండా.. అందరూ కలిసి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. రెండు రోజులు స్టేషన్ లో ఉంచారు.. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య, అత్తింటి వారు ఇలా చేయటంతో కొత్తగా పెళ్లయిన ఈ యువకుడు మనో వేదనకు గురయ్యాడు. అంతే రెండు రోజులకు.. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా రైల్వే స్టేషన్ కు వెళ్లాడు. పట్టాలపై పడుకున్నాడు. ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘోరం ఏపీ రాష్ట్రం విజయవాడలో జరిగింది.

ఆ యువకుడి పేరు గురవారెడ్డి. చనిపోయే ముందు తన బాధను, ఆత్మహత్యకు కారణాలను సెల్ఫీ వీడియో తీశాడు. చావుకి కారణం ఎవరో కూడా స్పష్టంగా చెప్పాడు. మరణ వాగ్మూలం ఇచ్చాడు. అమ్మా, నాన్నలకు సారీ చెప్పాడు. క్షమించమని కోరాడు. నా చావుకి భార్య, అత్తమామలు, బావమరిదే కారణం అని రైల్వేస్టేషన్ సాక్షిగా.. చెప్పి మరీ చనిపోయాడు. చెయ్యని తప్పుకి రెండు రోజుల పోలీస్ స్టేషన్ లో పెట్టారని చెప్పాడు. అది విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్. గురవారెడ్డి ఆత్మహత్యతో అతని బంధువులు ఆందోళనకు దిగారు. మరణ వాగ్మూలం ఆధారంగా చావుకి కారణం అయిన అతని భార్య, అత్తమమాలను అరెస్ట్ చేయాలని.. తప్పు ఏంటో కూడా తెలుసుకోకుండా రెండు రోజులు స్టేషన్ లో నిర్బంధించిన కృష్ణలంక పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.


Posted in Uncategorized

Latest Updates