మరాఠాల బెబ్బులి : థాకరే ట్రైలర్ రిలీజ్

 మరాఠా ల బెబ్బులి.. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే జీవిత చరిత్ర ఆధారంగా ‘థాకరే’ సినిమా తెరకెక్కగా… బుధవారం  సినిమా ట్రైలర్ ను.. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే సమక్షంలో విడుదల చేశారు. ఈ సినిమాకు అభిజిత్ పన్సే దర్శకత్వం వహించారు. బాల్ థాకరే పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించారు.

ముంబైలో అల్లర్లు జరుగుతున్న సందర్భాన్ని చూపుతూ ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ముంబై నగరాన్ని ప్రస్తుతం రక్షించేది కేవలం ఒకే వ్యక్తి.. అనగానే బాల్ థాకరే ను చూపిస్తారు. తన హక్కును కాపాడుకోవటానికి  గుండాగిరి చేసినా తప్పులేదని.. మహారాష్ట్ర.. మరాఠీలదని  బాల్ థాకరే పిలుపునిస్తారు.

కేంద్ర హోం మినిష్టర్ ను సైతం ఎదిరించే సీన్ లను ట్రైలర్ లో పొందుపరిచారు. రెండు సీన్లపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమా కథను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా జనవరి 25 న సినిమా విడుదల కానుంది.

 

 

Posted in Uncategorized

Latest Updates