మరింత జోష్ : ఉమెన్స్ IPL మ్యాచ్ లకు BCCI ప్లాన్

tushar-arothe-with-the-indian-womens-cricket-teamఇంటర్నేషనల్ క్రికెట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు ఇది పురుషుల కోసం నిర్వహిస్తున్న టీ20 లీగ్. వరుసగా 10 సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకొని పదకొండో సీజన్‌లోకి అడుగుపెడుతున్న సందర్భంగా మహిళల కోసం కూడా టీ20 లీగ్‌ను నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది BCCI. ఈ క్రమంలోనే 2018లో జరిగే టోర్నీ మ్యాచ్‌ల్లో మహిళా క్రికెటర్లతో కొన్ని ఎగ్జిబిషన్ మ్యాచ్‌లను నిర్వహించడానికి ప్రణాళికలు వేస్తోంది.

ఉమెన్స్ కోసం లీగ్ లాంచ్ చేసే ముందు ఇది సన్నాహాకంగా ఉపయోగపడుతుందని చూస్తోంది బోర్డు. ఈ సంవత్సరం IPL సందర్భంగా ప్రయోగాత్మకంగా కొన్ని మహిళల టీ20 మ్యాచ్‌లను నిర్వహించేందుకు BCCI సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్. ఇదే ప్రతిపాదనపై 2017 అక్టోబర్‌లో IPL పాలక మండలి సైతం సమావేశంలో చర్చించింది. వీటిని నిర్వహించడానికి చాలా కసరత్తు చేయాలని, సరైన ప్లానింగ్ ఉండాలన్నారు COA మహిళా సభ్యురాలు డయానా ఎడుల్జీ. ఒకవేళ ఇదే కార్యరూపందాల్చితే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లకు చెందిన ఉమెన్స్ క్రికెటర్లు ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల్లో తలపడే అవకాశం ఉంది.

Posted in Uncategorized

Latest Updates