మరింత మంట : హైదరాబాద్ లో ఇవాళ్టి పెట్రో ధరలు

రోజురోజుకి పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. పెరుగుతున్నాయి తప్ప..తగ్గడంలేదు. ముంబైలో 90 దాటిన పెట్రో మంట..హైదరాబాద్ లోనూ 90కి దగ్గరకి వస్తోంది. చమురు మార్కెటింగ్ సంస్థలు రోజుకింత చొప్పున పెంచుకుంటూ పోతుండగా, ధరలు మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలను తాకుతున్నాయి. శ‌నివారం (సెప్టెంబర్-29) ముంబైలో లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 22 పైస‌లు పెరిగింది. ఢిల్లీలో పెట్రోల్‌ పై లీట‌ర్‌ కు 22పైస‌లు, డీజిల్‌ పై 21పైస‌లు పెరిగింది.

దీంతో ముంబ‌యిలో ఇవాళ‌ లీట‌ర్ పెట్రోల్ రూ.90.75, డీజిల్ రూ.79.23ను చేరాయి. హైద‌రాబాద్‌ లో లీట‌ర్ పెట్రోల్ రూ.88.41, డీజిల్ రూ.81.18 వ‌ద్ద ఉన్నాయి. డాలర్‌ తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం, అంతర్జాతీయ మార్కెట్‌ లో ముడి చమురు ధరల పెరుగుదల దేశీయ ఇంధన ధరలకు రెక్కల్ని తొడుగుతున్నాయి.

 

Posted in Uncategorized

Latest Updates