మరికొన్ని రోజులు కరుణానిధి హాస్పిటల్ లోనే

డీఎంకే అధినేత, తమిళనాడు మజీ సీఎం కరుణానిధికి వయోభార సంబంధ ఆరోగ్య సమస్యలున్నాయని, మరికొన్ని రోజులు హాస్పిటల్ లోనే ఉండి కరుణానిధి ట్రీట్ మెంట్ తీసుకోవాల్సిన అవసరముందని కావేరీ హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. డాక్టర్ల పర్యవేక్షణలోనే కరుణానిధికి చికిత్స కొనసాగుతుందని తెలిపారు. దీనికి సంబంధించి ఓ  లెటర్ ను విడుదల చేసింది హాస్పిటల్ మేనేజ్ మెంట్. కరుణానిధి ఆరోగ్యంపై వస్తున్న వార్తలను తోసిపుచ్చుతూ ఈ ప్రకటనను హాస్పిటల్ మేనేజ్ మెంట్ విడుదల చేసింది. మరోవైపు సీనీ, రాజకీయ ప్రముఖులు కావేరీ హాస్పిటల్ కు వెళ్లి కరుణానిధిని పరామర్శిస్తున్నారు. మంగళవారం(జులై-31) సాయంత్రం సూపర్ స్టార్ రజనీ కాంత్ కరుణానిధిని పరామర్శించారు.  ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ… కరుణానిధిని పరామర్శించారు. కరుణానిధి చాలా గట్టిమనిషని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates