మరిన్ని రికార్డులతో.. ముందుకు దూసుకెళ్తున్న మహానటి

Mahanati 2 Millionఅలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌ నటించారు. పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటిపై కాసుల వర్షం కురుస్తోంది.

మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి ఓవర్‌ సీస్‌లో ఇప్పటి వరకు రెండు మిలియన్‌ డాలర్ల వసూళ్లు సాధించింది. ఇప్పటికీ హౌస్‌ ఫుల్‌ కలెక్షన్లతో నడుస్తున్న మహానటి ముందు ముందు మరిన్ని రికార్డులు సాధించటం ఖాయం అంటున్నారు సినిమా విశ్లేషకులు. వైజయంతి మూవీస్‌, స్వప్నా సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో దుల్కర్‌ సల్మాన్‌, సమంత, విజయ్‌ దేవరకొం‍డ, రాజేంద్ర ప్రసాద్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

Posted in Uncategorized

Latest Updates