మరిన్ని సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా సింధు

బ్యాడ్మింటన్‌ ‌స్టార్ పీవీ సింధు బ్రాండ్‌ ‌ఇమేజ్‌‌ ఓ లెవెల్లోదూసుకుపోతోంది.ఏటా బ్రాండ్‌‌వ్యాల్యూ ద్వారా సింధు దాదాపు రెండున్నర కోట్ల నుంచి మూడు కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. 23 ఏళ్ల సింధు ఆటలో తన సత్తా చాటుతోంది. దీంతో ఆమె బ్రాండ్‌ ‌ఇమేజ్‌ ‌మరింత పెరిగే అవకాశముందంటున్నారు ఎక్స్‌పర్ట్స్.WBF‌ టోర్నీ ఫైనల్‌‌ విజయంతో సింధు సిల్వర్‌ స్టార్‌‌గా తనపై ఉన్న ముద్రను చెరిపేసుకోవటమే కాకుండా ఈ ఏడాది కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రైజ్‌‌మనీ 86.5 లక్షల రూపాయలను సొంతం చేసుకుంది. దీంతో సింధు ఏడాది సంపాదన నాలుగు కోట్లు దాటిపోయింది. ఇప్పటికే చాలా కంపెనీలు సింధు కోసం క్యూ కడుతుండగా… మరికొన్ని అగ్రశ్రేణి సంస్థలు కూడా ఆమె బ్రాండ్‌‌ ఇమేజ్‌‌కోసం పోటీపడుతున్నాయి. బ్రిడ్జిస్టోన్‌ ఇండియా,మూవ్‌‌, పానాసోనిక్‌ బ్యాటరీస్‌‌, వైజాగ్‌‌స్టీల్స్‌, శాంసంగ్‌ లాంటి 15 సంస్థలకు పైగా సింధు ఇమేజ్‌ ‌కోసం పోటీపడుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య దాదాపు 25కు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు నిపుణులు.

Posted in Uncategorized

Latest Updates