మరి ఎవరు పంపారు : ఈ నెంబర్ మేం పంపించలేదు

దేశంలోని కోట్లాదిమంది మొబైల్ ఫోన్లలో….. యునిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా(UIDAI) హెల్ప్‌లైన్ నంబర్ అంటూ శుక్రవారం (ఆగస్టు-3) ఆటోమేటిక్ గా ఓ నంబర్ కాంటాక్ట్ లిస్ట్‌ లో యాడ్ అయింది. అయితే ఏంటీ గందరగోళం అంటూ మొబైల్ యూజర్లు ఆందోళన చెందుతున్న సమయంలో…..UIDAI దీనిపై వివరణ ఇచ్చింది. అసలు ఆ నెంబర్ తమ నుంచి వచ్చింది కాదని క్లారిటీ ఇచ్చింది. ఏ సర్వీస్ ప్రొవైడర్ కు, మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ కు ఆ నంబర్‌ ను మొబైల్ యూజర్ల కాంటాక్ట్  లిస్ట్ లో  యాడ్ చేయాలని తాము కోరలేదని UIDAI స్పష్టంచేసింది. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ఎవరో కావాలని ఆ నెంబర్ ను మొబైల్ కాంటాక్ట్ లిస్ట్ లలో యాడ్ చేసి ఉంటారని తెలిపింది. తమ హెల్ప్‌ లైన్ నంబర్ 1947 అని.. ఇది మారిందన్న ప్రచారం తప్పేనని చెప్పింది. అంతకుముందు1947 అయిన UIDAI హెల్ప్ లైన్  నెంబర్… 1800-300-1947గా మారినట్లు ప్రచారం జరిగింది. ఈ సమయంలో శుక్రవారం మొబైల్ కాంటాక్ట్ లిస్ట్ లోకి వచ్చింది కూడా ఈ నెంబర్ అవడంతో అందరూ షాక్ అయ్యారు.

Posted in Uncategorized

Latest Updates