మరీ ఇంతలానా బాస్ : అమ్మాయిలని కూడా చూడకుండా..

రాజస్థాన్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి.. ఇప్పటికే ఓసారి పేపర్ లీక్ ఆరోపణలతో వాయిదా పడ్డాయి. శని, ఆదివారాలు (జూలై 14,15 తేదీలు) నిర్వహించింది రాజస్థాన్ ప్రభుత్వం. ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎంతలా అంటే.. ఓ చిన్న కాగితం కూడా ఎగ్జామ్ సెంటర్ లోకి ప్రవేశించకుండా. ఇదే ఇప్పుడు విమర్శలపాలు కూడా చేసింది. ఎగ్జామ్ సెంటర్ కు వచ్చిన అభ్యర్థులను తనిఖీ పేరుతో పోలీసులు మరీ టూమచ్ చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆడ, మగ అని తేడా లేకుండా అందరికీ చుక్కలు చూపించారు.

మగ అభ్యర్థులు కూడా సిగ్గుపడేలా వ్యవహరించారు. చొక్కా, ప్యాంట్ తోపాటు డ్రాయర్ కూడ విప్పించారు. బూట్లు వేసుకున్నా సెంటర్ లోకి అనుమతి ఇవ్వలేదు. ఇక మహిళా అభ్యర్థులకు అయితే చుక్కలే. మగ సెక్యూరిటీ సిబ్బందే తనిఖీలు చేశారు. జడ పిన్నులు, ఒంటిపై బంగారం నుంచి తీసేశారు. చెవి దిద్దులను బలవంతంగా తీయించారు. ఫుల్ హ్యాండ్స్ ఉంటే.. కట్ చేశారు. జడలు తీయించారు. రూల్స్ పేరుతో చాలా కఠినంగా వ్యవహరించారని.. మరీ టూమచ్ చేశారని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరికి పెన్నులను కూడా వదలకుండా పరిశీలించారు. ఈ ఘటనపై విమర్శలు రావటంతో బోర్డ్ ఉన్నతాధికారులు స్పందించారు. లక్షల మంది అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన అంశం అని.. ఈ మాత్రం కఠినంగా లేకపోతే కష్టం అంటూ సమర్ధించుకున్నారు. గతంలో మాస్ కాపీయింగ్ కుంభకోణంలో 26 మంది అరెస్ట్ అయిన విషయాన్ని గుర్తు చేశారు.

Posted in Uncategorized

Latest Updates