మరీ ఇంత తక్కువ ధరలా : మహారాష్ట్రలో పాల రైతుల ఆందోళన

రైతుల దగ్గర తక్కువ ధరకు పాలు కొనుగోలు చేసి… డెయిరీలు అత్యధిక లాభాలు పొందటాన్ని నిరసిస్తూ.. ముంబైలో అర్ధరాత్రి నుంచి ఆందోళనకు దిగారు పాల రైతులు. స్వాభిమాని సెట్కారీ సంఘటన రైతు సంఘం ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతుంది. పుణె, ముంబై నగరాలకు పాల సరఫరా చేస్తున్న కంటైనర్లను నిలివేశారు. రోడ్లపై పాలప్యాకెట్లను విసిరి నిరసన తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రైతులకు 5 రూపాయలు అదనంగా ఇవ్వాలని స్వాభిమాని సెట్కారీ సంఘటన్ నాయకులు డిమాండ్ చేశారు. శాంతియుతంగా సమ్మె చేయాలని భావిస్తున్నా… పాల ఉత్పత్తిదారులను అక్రమంగా అరెస్టులు చేశారని ఆరోపించారు. పాడిరైతుల నుంచి 17రూపాయలకు లీటర్ కొనుగోలు చేసి… 42 రూపాయలకు డెయిరీలు అమ్ముకుంటూ లాభాలు గడిస్తున్నాయని అన్నారు.

Posted in Uncategorized

Latest Updates