మరీ టూ మచ్ ఇది : అక్కడి వారికి మోడీ ఎవరో తెలియదంట

PLప్రపంచంలోనే అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరైన మన ప్రధాని నరేంద్రమోడీ ఎవరో అక్కడి వాళ్లకు తెలియదట! ప్రపంచంలోనే ఎక్కువదేశాల్లో పర్యటించిన ప్రధానమంత్రిగా గుర్తింపు కలిగిన మోడీ గురించి తెలియదంటే నిజంగానే ఆశ్యర్యపోక తప్పదు మరీ. ఈ మాట అన్నది భారతీయులు కాదులేండి. కెనడా ప్రజల్లో 75 శాతం మందికి మోడీ ఎవరో తెలియదు. ఆ దేశంలో ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ఈ విషయాన్ని బయటపెట్టింది.

ప్రపంచ నేతల గురించి కెనడా వాసులకు ఎంత మేర తెలుసనే దానిపై అంగుస్‌ రైడ్‌ ఇనిస్టిట్యూట్‌(ARI) ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా 75శాతం మంది కెనడియన్లు అసలు మోదీ ఎవరో కూడా తమకు తెలియదని చెప్పారు. కొంతమంది మాత్రం ఆయనను గుర్తించారు. భారత్ అంటే ఎంతో ఇష్టపడే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల కుటుంబ సమేతంగా భారత్ పర్యటించి ప్రధాని మోడీని కలిసిన విషయం తెలిసిందే. అయినా కూడా మన ప్రధాని మోడీగారు ఎవరో తెలియదు అనటం విడ్డూరంగా ఉందంటున్నారు భారతీయులు. కెనడా వారికి బొత్తిగా పేపర్లు, టీవీలు చూసే అలవాటు లేదంటున్నారు నెటిజన్లు.

నాలుగేళ్లుగా అలుపు లేకుండా ప్రపంచంలోని అన్ని దేశాలను చుట్టేసి.. భారతదేశం కీర్తి, ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న ప్రధాని మోడీ అంటే ఎవరో కెనడాలోని 75శాతం మందికి తెలియకపోవటం విచిత్రంగా అనిపిస్తోంది అంటున్నారు భారతీయులు. కేవలం నాలుగేళ్లలో 85 విదేశీ పర్యటనల్లో భాగంగా.. 56 దేశాలను పర్యటించిన ప్రధానిగా మోడీ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే..

Posted in Uncategorized

Latest Updates