మరీ టూ మచ్ కదా : అర్థనగ్నంగా శ్రీరెడ్డి నిరసన

sri-reddy-film-chamberనటి శ్రీరెడ్డి అన్నంత పనీ చేసింది. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై చర్యలు తీసుకోవాలని.. పరిస్థితులను చక్కదిద్దాలని కొంత కాలంగా డిమాండ్ చేస్తూ వచ్చింది. పలు ఛానల్స్ లో ఈ విషయంపై వ్యాఖ్యలు కూడా చేసింది. సినీ ఇండస్ట్రీలోని పెద్దలు సైతం స్పందించాలని.. ఎవరూ ముందుకు రాకపోతే బట్టలు విప్పేసి నిరసన వ్యక్తం చేస్తాను అంటూ చెప్పింది. ఏప్రిల్ 7వ తేదీ శనివారం ఉదయం అన్నంత పనీ చేసింది. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ బిల్డింగ్ ఎదుట అర్థనగ్నంగా కూర్చున్నది. నిరసన వ్యక్తం చేసింది. మాలో సభ్యత్వం ఇవ్వాలని.. తెలుగు నటీమణులకు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ అర్థనగ్న నిరసన చేపట్టింది శ్రీరెడ్డి.

శ్రీరెడ్డి అర్థనగ్నం నిరసనతో సినీ ఇండస్ట్రీ షాక్ అయ్యింది. సామాన్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫిల్మ్ ఛాంబర్ ఎదుట, ఓపెన్ ప్లేస్ లో ఇలా అర్థనగ్నంగా నిరసన తెలపటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సినీ ఇండస్ట్రీ పెద్దలు. ఇలాంటి చర్యలు ఫిల్మ్ ఇండస్ట్రీని దిగాజార్చే విధంగా ఉన్నాయని.. ఏదైనా సమస్య ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి కానీ.. ఇలాంటి విపరీత చర్యలు మంచిది కాదని హితవు పలికారు. అర్థనగ్న నిరసన విరమించాలని ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు కోరినా వినకపోవటంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చిన బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. శ్రీరెడ్డి అర్థనగ్న నిరసన కలకలం రేపింది.

Posted in Uncategorized

Latest Updates