మరుగుదొడ్డి అడిగాడనే : ఇలా ఈడ్చుకెళ్లి.. కారుతో తొక్కించబోయాడు

nidhuluఉత్తరప్రదేశ్ లో అతి అరాచకమైన ఘటన జరిగింది. టాయిలెట్ల నిర్మాణానికి రొండో విడత నిధులు విడుదల చేయాలంటూ బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్(BDO) కార్యాలయానికి వెళ్లిన గ్రామస్తులకు చేదు అనుభవం ఎదురైంది.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం రామ్‌నగర్‌ కు చెందిన గ్రామస్తులు టాయిలెట్ల నిర్మాణానికి రొండో విడత నిధులను రిలీజ్ చేయాలని బుధవారం(ఏప్రిల్-11) BDO ఆఫీస్ కు వెళ్లారు. ఆఫీస్ లో ఎవరూ స్పందించలేదు. దీంతో సాయంత్రం వరకూ ఎవరైనా వచ్చి.. తమ సమస్యపై స్పందిస్తారని ఆఫీస్ బయట ఎదురుచూశారు. సాయంత్రం 5 గంటల సమయంలో BDO పంకజ్‌ కుమార్‌ గౌతమ్‌ ఆఫీస్ కు వచ్చారు. బయట కూర్చొని ఉన్న రైతుల వైపు కన్నైతి కూడా చూడకుండా కారు స్టార్ట్ చేసి వెళ్లబోయారు. ఇది గమనించిన గ్రామస్తులు కారును అడ్డుకుని.. సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అయితే గ్రామస్తుల వినతిని లెక్కచేయకుండా ముందుకు వెళ్లాడు ఆఫీసర్. వారిని ఏ మాత్రం లెక్కచేయని అధికారి పంకజ్.. తన కారును ముందుకు పోనిచ్చాడు.

దీంతో కొందరు కారుకు అడ్డుతప్పుకోగా.. ఒక యువకుడు మాత్రం కారు బానెట్ పై ఎక్కాడు. అయినా.. ఆఫీసర్ పంకజ్‌ కారును ఆపకుండా నాలుగు కిలోమీటర్లు అలానే పోనిచ్చాడు. ఈ ఘటన మొత్తం పంకజ్‌ తన ఫోన్‌ లో వీడియో తీశాడు. తనే స్వయంగా వీడియోని సోషల్‌ మీడియాలో పెట్టాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌ అయ్యింది. ఈ ఘటనపై స్పందించిన చీఫ్‌ బ్లాక్ డెవలప్‌ మెంట్‌ ఆఫీసర్‌ విచారణకు ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని నియమించారు.
https://youtu.be/eiLiCGc8yLM

Posted in Uncategorized

Latest Updates