మరుగుదొడ్లు లేకుంటే రేషన్‌ కట్‌

SUNITHAకేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం స్వచ్ఛభారత్. దీనికి దేశ వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి. ముఖ్యంగా మరుగుదొడ్లను అందరూ నిర్మించుకోవాలని సూచించాయి. అధికారులు ప్రజల్లో  చైతన్యం తీసుకు వస్తున్నారు. అయినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో మరుగుదొడ్లు లేవు. లెట్రిన్లు నిర్మించుకుంటే గ్రామాలకు ప్రోత్సహాకాలు అందిస్తున్నారు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. ఇందులో భాగంగా మరుగుదొడ్లు నిర్మించుకోకుంటే సంక్షేమ పథకాలు నిలిపేస్తామని స్పష్టం చేస్తున్నాయి.

మరుగుదొడ్లు నిర్మించుకోకుంటే రెండు నెలల రేషన్‌ సరుకులు కట్‌ చేస్తామన్నారు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌ పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి. పూడూరు మండల పరిధిలోని కొత్తపల్లి, పెద్ద ఉమ్మెంతాల్‌,మన్నెగూడలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరు మరుగు దొడ్లు నిర్మించుకొని జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. ఆయా గ్రామాల్లోని సర్పంచ్‌లు ప్రతి ఒక్కరు మరుగు దొడ్లు నిర్మించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అలాగే గ్రామాల్లో స్వచ్చభారత్‌ కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు సునీతామహేందర్‌రెడ్డి.

Posted in Uncategorized

Latest Updates