మరేం పర్వాలేదు : కరుణానిధి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల

బీపీ సమస్యతో బాధపడుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి M.కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉందని చెన్నై కావేరీ హాస్పిటల్ డాక్టర్లు ప్రకటించారు. ఈ సాయంత్రం కావేరీ హాస్పిటల్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. బీపీ సాధారణ స్థాయికి వచ్చిందని హాస్పిటల్ తెలిపింది. బీపీ పడిపోవడంతో… అర్థరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో కరుణానిధి కావేరీ హాస్పిటల్ కు తరలించారు. అలాగే మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్ కారణంతో జ్వరం కూడా ఉంది. కొద్ది నెలల కిందటే… కరుణానిధికి ఆపరేషన్ చేసి గొంతు ద్వారా కృత్రిమ వాయునాళం అమర్చారు.
కరుణానిధి కొడుకులు అళగిరి, స్టాలిన్, కూతురు కనిమొళి సహా మొత్తం కుటుంబం హాస్పిటల్ కు వచ్చారు. కరుణను తమిళ రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించారు. తమిళనాడు గవర్నర్ భన్వరీ లాల్ పురోహిత్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అధ్యక్షుడు TTV దినకరన్, DMK జనరల్ సెక్రటరీ K అన్బళగన్, తుగ్లక్ ఎడిటర్ స్వామినాథన్ గురుమూర్తి సహా తమిళ సినీ, రాజకీయ దిగ్గజాలు కావేరీ హాస్పిటల్ కు వచ్చారు.
కరుణ ఆరోగ్యం బాగుండాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. వేల సంఖ్యలో అభిమానులు కావేరీ హాస్పిటల్ దగ్గరే ఉంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates