మరోసారిఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి..తిప్పికొట్టిన భారత బలగాలు

Armyజమ్మూకశ్మీర్‌లోని సంజువాన్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడి విషాదాన్ని మరువకముందే  టెర్రరిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సోమవారం (ఫిబ్రవరి-12) ఉదయం శ్రీనగర్‌లోని కరణ్ నగర్‌లోని ఆర్మీ క్యాంపుపై ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అలర్టైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపగా ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయని ఆర్మీ అధికారులు తెలిపారు.

సంజువాన్‌లో ఆర్మీ క్యాంపుపై జరిపిన ఉగ్రదాడిలో ఐదుగురు ఆర్మీ సిబ్బంది, ఒక పౌరుడు చనిపోయారు. నలుగురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి.

Posted in Uncategorized

Latest Updates