మరోసారి కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

stock-market-759

దేశీయ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. వరస నష్టాల నుంచి కోలుకుంటున్న సమయంలోనే అమెరికా మార్కెట్లు దేశీయ సూచీలను కలవరపెడుతున్నాయి. గురువారం రోజు ట్రేడింగ్‌లో అమెరికా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఆ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై పడింది. మార్కెట్లు ఆరంభంలోనే కుప్పకూలిన సూచీలు భారీ నష్టాల్లో సాగుతున్నాయి. ఈ రోజు (ఫిబ్రవరి9) ప్రీ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 500 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ కూడా 10వేల 500 దిగువన ట్రేడింగ్‌ అయ్యింది. ప్రస్తుతం 450 పాయింట్లు నష్టంతో 33,962 దగ్గర ట్రేడ్ అవుతుంది సెన్సెక్స్. నిఫ్టీ 135 పాయింట్ల నష్టంతో 10,442 దగ్గర ట్రేడ్‌ అవుతుంది నిఫ్టీ. ఐటీ, బ్యాంకింగ్‌, టెలికాం షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

4శాతం పతనమైన అమెరికా మార్కెట్లు

పెట్టుబడిదారులు ఈక్విటీ నుంచి బాండ్లను మార్కెట్‌ వైపు ఆశస్తి చూపడంతో అమెరికా మార్కెట్లు మళ్లీ భారీగా పడిపోయాయి. డోజోన్స్‌ వెయ్యి పాయింట్లు కోల్పోయింది. నాస్‌డాక్‌ కూడా భారీ నష్టాలతో ముగిసింది.

 

Posted in Uncategorized

Latest Updates