మరోసారి తాత అయిన చిరు

క్రిస్మస్‌ పర్వదినాన మెగాస్టార్‌ చిరంజీవి ఇంట సంతోషాలు వెల్లివిరిశాయి. చిరు చిన్న కూతురు శ్రీజ ఇవాళ ( మంగళవారం) ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త కళ్యాణ్‌ దేవ్‌ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తన కూతురి కాలి ముద్ర ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో పాటు ‘ 2018 క్రిస్మస్‌ మాకు జీవితాంతం గుర్తుండి పోతుంది. ఆడపిల్ల పుట్టింది. అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు’ అంటూ క్యాప్షన్‌ జతచేశారు.

విజేత సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్‌ దేవ్‌ ప్రస్తుతం రెండో సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates