మరో అగ్నిపర్వతం బద్దలు : గ్వాటెమాల సిటీని చుట్టుముట్టిన మంటలు

Guatemala volcano fireగ్వాటెమాల సిటీలో అగ్నిపర్వతం పేలి 25 మంది చనిపోయారు. వందలాది మందికి గాయాలయ్యాయి. గ్వాటెమాల సిటీకి 40 కిలో మీటర్ల దూరం ఉన్న ప్యూగో అగ్నిపర్వతం ఆదివారం రాత్రి పేలింది. చుట్టుపక్కల దట్టమైన పొగలు కమ్ముకునున్నాయి. ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. వర్షంలా దమ్ము, ధూళి, బూడిద పడుతోంది. దీంతో విమానాశ్రయాన్ని మూసివేశారు అధికారులు. లావా పరిసర గ్రామాల్లోకి వస్తుండటంతో.. సహాయ సిబ్బందిని గ్రామాలను ఖాళీ చేయిస్తోంది. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

లావా నదిలా ప్రవహిస్తోంది. అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద సముద్రమట్టానికి 12,346 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడుతోంది. ఈ అగ్నిపర్వతం పేలుడు లక్షలాది మంది ప్రజలపై ప్రభావం చూపుతుందని అధికారులు చెబుతున్నారు. గ్వాటెమాలాలో ఈ ఏడాది బద్దలైన అగ్నిపర్వాతాల్లో ఇది రెండోది. ఇంకా రెండు అగ్నిపర్వతాలు పేలడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దేశ అధ్యక్షుడు జిమ్మి మోరల్స్ .. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్వాటెమాలకు అన్ని రకాలుగా సాయం చేస్తానని మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ నీటో ప్రకటించారు.

Posted in Uncategorized

Latest Updates