మరో అవకాశం: జులై 2 నుంచి కొత్త ఓటర్ల నమోదు

electionవచ్చే ఏడాది (2019) సాధారణ ఎన్నికలు జరగనుండటంతో యువకులతో పాటు ఇంకా ఓటర్లుగా నమోదు కానీ వ్యక్తులు..ఓటర్లుగా నమోదు అయ్యేందుకు అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఓటర్ల లిస్టును సవరించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఈనెల 20 నుంచి ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు చేపట్టనున్నారు. 2019 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ ప్రకటించారు. ఓటరు నమోదు చేసుకునేందుకు సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటరు లిస్టుపై అభ్యంతరాలు, దిద్దుబాట్ల కోసం అదేగడువులోగా దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. దరఖాస్తులను బూత్‌లవారీగా  www.eci.nic.in వెబ్‌సైట్‌లో సమర్పించవచ్చు.

ఈనెల 20లోపు ఓటర్ల నమోదుపై ప్రచారం, శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈనెల 21 నుంచి 30వ తేదీ దాకా ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాను పరిశీలించనున్నారు. జూలై 2 నుంచి 31 దాకా కొత్త ఓటర్లను జాబితాలో నమోదు చేయనున్నారు. దీనికోసం ఆయా తేదీల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. వచ్చే ఏడాది(2019) జనవరి 4న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు.

Posted in Uncategorized

Latest Updates