మరో అవార్డుకు చేరువలో కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మరో రికార్డు ఊరిస్తోంది. ఆగస్టు 1న ఇంగ్లండ్‌ తో మొదలయ్యే ఐదు టెస్ట్‌ ల సిరీస్‌ లో విజయం సాధిస్తే దిగ్గజాలు అజిత్ వాడేకర్, కపిల్‌ దేవ్, రాహుల్ ద్రవిడ్ సరసన కోహ్లీ చోటు దక్కించుకుంటాడు. సౌరవ్ గంగూలీ, ధోనీకి సాధ్యం కాని అరుదైన రికార్డును విరాట్ అందుకుంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో ఎన్నోసార్లు ఇంగ్లండ్‌ లో పర్యటించి విఫలమైన భారత జట్టు 1971లో అజిత్ వాడేకర్ కెప్టెన్సీలో తొలిసారి సిరీస్ విజయాన్నందుకుంది. మూడు టెస్ట్‌ల సిరీస్‌ ను టీమ్‌ఇండియా 1-0తో గెలిచింది. ఆ తర్వాత హర్యానా హారికేన్ కపిల్‌ దేవ్ కెప్టెన్సీలో భారత్ 1986లో ఇంగ్లండ్ జట్టుపై సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. మూడు టెస్ట్‌ ల్లో రెండింటిని దక్కించుకుంది. ఆఖరిసారిగా రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని టీమ్‌ ఇండియా 2007లో ఇంగ్లండ్‌ ను ఓడించింది. మూడు టెస్ట్‌ ల సిరీస్‌ లో 1-0తో విజయం సాధించింది. ఇంగ్లండ్‌ పై సిరీస్ విజయం వాడేకర్, కపిల్‌దేవ్, ద్రవిడ్‌ కు సాధ్యపడగా, గంగూలీ, ధోనీకి నిరాశే ఎదురైంది. 2002లో దాదా కెప్టెన్సీలోని భారత్ నాలుగు టెస్ట్‌ లను 1-1తో డ్రా చేసుకోగా, 2014లో ఐదు టెస్ట్‌ లను ధోనీసేన 1-3తో కోల్పోయింది.

Posted in Uncategorized

Latest Updates