మరో ఆప్షన్ : ముఖం చూపిస్తే చాలు..ఆధార్ ధ్రువీకరణ

ADHAR FACEఆధార్ ధ్రువీకరణ కోసం ఇప్పటివరకు వేలిముద్ర, కంటిపాపని మాత్రమే గుర్తులుగా తీసుకున్న UIDAI..ఇప్పుడు మరో ఆప్షన్ ను తీసుకురానుంది. దీంతో వృద్ధాప్యంతో వేలిముద్రలు చెరిగిపోయిన, మసకబారిన వారికి ఆధార్‌ ధ్రువీకరణ సమయంలో ఇబ్బందులు తొలగిపోనున్నాయి.

ముఖంతోనూ ఆధార్‌ ధ్రువీకరణ చేపట్టేందుకు ఆధార్‌ ప్రాధికార సంస్థ( UIDAI) సమాయత్తమవుతోంది. జూలై 1 నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది. అయితే ఆధార్‌ ధ్రువీకరణకు ముఖం ఒక్కటే సరిపోదని తెలిపింది UIDAI.  దీనికి అదనంగా వేలిముద్రలు, కంటిపాప, వన్‌టైం పాస్‌వర్డ్‌(OTP)ల్లో ఒకదాన్ని కూడా సరిపోల్చాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చింది.

ఆధార్‌ సమాచారం దుర్వినియోగమవుతోందని ప్రచారం చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఆదివారం వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి కేజే ఆల్ఫోన్స్‌. వీసా కోసం విదేశీయుల ముందు దుస్తులు విప్పడానికి సిద్ధపడే భారతీయులు..ప్రభుత్వం వ్యక్తిగత వివరాలు అడిగితే మాత్రం ప్రైవసీ దెబ్బతింటుందని రాద్ధాంతం చేస్తున్నారని చురకలంటించారు.  అమెరికా వీసా కోసం నేను 10 పేజీల దరఖాస్తును నింపానని.. తెల్లవాడికి మన వేలిముద్రలు ఇవ్వడానికి, వారి ముందు నగ్నంగా నిలబడటానికి మనకేం అభ్యంతరం ఉండదు కానీ.. మన ప్రభుత్వమే పేరు, చిరునామా లాంటి వివరాలు అడిగితే మాత్రం గోప్యతను ఉల్లంఘిస్తున్నారని గగ్గోలు పెడుతున్నారన్నారు ఆల్ఫోన్స్‌.

 

Posted in Uncategorized

Latest Updates