మరో కోనసీమలా కరీంనగర్ : హరీష్

harishఉమ్మడి కరీంనగర్ ను మరో కోనసీమ చేస్తామన్నారు మంత్రులు హరీశ్, ఈటల. జగిత్యాల జిల్లాలో సూరమ్మ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించిన మంత్రులు.. వచ్చే దసరాకే సూరమ్మ చెరువులోకి నీళ్లొయ్యస్తాయని తెలిపారు. ఖర్చుకు వెనకాడకుండా.. చైనాకంటే వేగంగా రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందన్నారు మంత్రులు.
జగిత్యాల జిల్లా కలికోటలో 204 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సూరమ్మ ప్రాజెక్టుకు, అనుబంధ కాలువల నిర్మాణానికి మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఎంపీ వినోద్ తో పాటు.. స్థానిక ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు ఒక్కో ప్రాజెక్టును కొన్ని దశాబ్దాల పాటు నిర్మిస్తే… టీఆర్ఎస్ హయాంలో యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నామన్నారు మంత్రులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరో కోనసీమ కాబోతోందన్నారు మంత్రి హరీశ్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆపాలని చంద్రబాబు ఢిల్లీలో లేఖ ఇచ్చారని… ఇక్కడి పనులు చూసి బాబు కళ్లు మండుతున్నాయన్నారు. నదుల్లో 954 టీఎంసీల నీరు వాడుకునే హక్కు తెలంగాణకు ఉందన్నారు. బ్రహ్మదేవుడు కూడా కాళేశ్వరం ఆపలేరని చెప్పారు.
చైనా కంటే వేగంగా రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందన్నారు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్. ఖర్చుకు వెనకాడకుండా ప్రాజెక్టులు కడుతున్నామని,.. వ్యవసాయం, నీళ్ల కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నది ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని తెలిపారు. సూరమ్మ చెరువుతో 43 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని.. వచ్చే దసరాకే సూరమ్మ చెరువులోకి నీరు వస్తుందని తెలిపారు మంత్రులు.

Posted in Uncategorized

Latest Updates