మరో ఛాన్స్: LRS గడువుకు మరో నెల రోజులు

LRS-telanganaగత నెలాఖరుతో ముగిసిపోయిన లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించిన గడువును మరో నెల రోజులు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఇప్పటి వరకు ఫీజు చెల్లించని వారికి మరో అవకాశం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది.

అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం 2015, నవంబర్‌ 11న రాష్ట్ర ప్రభుత్వం LRS నుం ప్రవేశపెట్టి నిర్దేశిత ఫీజులతో సహా దరఖాస్తుల సమర్పణకు 2016, మార్చి వరకు టైం ఇచ్చింది. LRS కింద 2.6 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో 20 వేలకు పైగా దరఖాస్తుదారులు గడువులోగా ఫీజులు చెల్లించలేదు. రెండేళ్లుగా ఈ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఫీజు బకాయిలను వడ్డీతో సహా చెల్లిస్తే ఈ దరఖాస్తులను కూడా పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది..

దీంతో HMDAతో పాటు ఇతర మున్సిపాలిటీలకు మరింత ఆదాయం రానుందని భావిస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారానికి గడువు గత నెలాఖరుతో ముగిసింది. అప్పటికి HMDA,GHMC పరిధిలో దాదాపు 40 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం ప్రభుత్వం ఈ నెలాఖరులోగా గడువు పొడిగించనుంది. దీంతో రాష్ట్ర మున్సిపాలిటీ శాఖ రెండు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశముంది.

Posted in Uncategorized

Latest Updates