మరో డేరాబాబా : భక్తులపై అత్యాచారం చేసిన బలక్ నాథ్ బాబా

హర్యానాలో మరో ఫేక్ బాబా బాగోతం బయటపడింది. ఫతేబాద్ జిల్లాలోని తొహనా సిటీలోని బాబా బలక్ నాథ్ టెంపుల్ మహంత్.. బాబా అరంపురి అమ్మాయిలను బలవంతంగా రేప్ చేపిన వీడియోలు బయటకు వచ్చాయి. తన దగ్గరకు వచ్చే భక్తులను భయపెట్టి.. వారిపై రేప్ చేశాడు బాబా అరంపురి. బాబా బోగోతానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.

బాబా అరంపురిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు పోలీసులు. అదుపులోకి తీసుకొన్నారు. అతడి ఇంటిపై దాడులు చేశారు. బాబా ఇంట్లోని అనుమానాప్పద వస్తువులను సీజ్ చేశారు పోలీసులు. చాలా మంది అమ్మాయిలను ఇప్పటికే బలవంతం చేశాడని.. బాధితుల నుంచి వివరాలు కూడా సేకరించాం అని ప్రకటించారు పోలీసుల.

Posted in Uncategorized

Latest Updates