మరో ప్రయోగానికి ఇస్రో రెడీ :12న నింగిలోకి PSLV-C41

PSభారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం(ఇస్రో) నుంచి ప్రయోగానికి సిద్దమైంది PSLV -C41. నెల్లూరు జిల్లాలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌  షార్‌ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి గురువారం(ఏప్రిల్-12) వేకువ జామున 4.04 గంటలకు PSLV -C41 ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు శనివారం(ఏప్రిల్-7) ఇస్రో అధికారికంగా ప్రకటించింది. రాకెట్‌కు నాలుగు దశల అనుసంధానం పనులను పూర్తిచేసి తుది విడత పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఇండియన్‌ రీజనల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌  సిరీస్‌లో ఎనిమిదో ఉపగ్రహాన్ని రోదసీలోకి ప్రవేశపెట్టనుంది. PSLV సిరీస్ లో ఇది 43వ రాకెట్. ఆది, సోమవారాల్లో ప్రయోగ రిహార్సల్‌, ప్రికౌంట్‌  డౌన్‌ కార్యక్రమాలు జరగనున్నాయి. మంగళవారం(ఏప్రిల్-10) కౌంట్‌డౌన్‌ ప్రారంభమై 28 గంటల తర్వాత 12 న PSLV నింగిలోకి దూసుకెళ్లనుంది.

Posted in Uncategorized

Latest Updates