మరో రాష్ట్రం చేరింది : యూపీలోనూ ప్లాస్టిక్ వాడకంపై నిషేధం

plasticbanupప్లాస్టిక్ వాడకంపై పలు రాష్ట్రాల్లో నిషేధం విధిస్తుండగా..ఇప్పుడు యూపీ కూడా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ లో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించింది. దీనికి సంబంధించిన ఆదేశాలను శుక్రవారం (జూలై-6)న జారీ చేసింది యూపీ ప్రభుత్వం. జూలై 15వ తేదీ నుంచి ప్లాస్టిక్‌ ను వినియోగించరాదు అని ఆ ఆదేశాల్లో తెలిపింది.

ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ప్లాస్టిక్‌ ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మితిమీరిన ప్లాస్టిక్ వినియోగం వల్ల కాలుష్యం ఎక్కువవుతున్నది. ఈ క్రమంలో కొన్ని రాష్ర్టాలు ప్లాస్టిక్‌ ను బ్యాన్ చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. శుక్రవారం (జూలై-6) యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ మొక్కలు నాటారు. వన మహోత్సవం సందర్భంగా బారాబంకిలోని లోదేశ్వర్ మహదేవ్ మందిర్‌ లో ఆయన ఓ మొక్కను నాటారు.

Posted in Uncategorized

Latest Updates