మరో రికార్డ్: సెంచరీతో అదరగొట్టిన కోహ్లీ

viratకేప్ టౌన్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో ఘనత సొంతం చేసుకున్నాడు. 119 బంతుల్లో 7 ఫోర్లతో కెరీర్‌లో 34వ సెంచరీ నమోదు చేసి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు కోహ్లీ. ఈ రోజు చేసిన సెంచరీతో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్ల జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు కోహ్లీ. 54 సెంచరీలతో ఇప్పటి వరకు ఈ స్థానంలో హాషిమ్‌ ఆమ్లా( దక్షిణాఫ్రికా), మహేళా జయవర్ధనే(శ్రీలంక) లు ఉన్నారు. ఈ రోజు చేసిన సెంచరీతో వారిని వెనక్కి నెట్టి వన్డేల్లో 34, టెస్టుల్లో 21 సెంచరీలతో కలపి కోహ్లి మొత్తం 55 సెంచరీలు చేశాడు. ఇక మొదటి స్థానంలో సచిన్‌(100) ఉండగా, పాంటింగ్‌(ఆస్ట్రేలియా) 71, సంగక్కర(శ్రీలంక) 63,  జాక్వస్‌ కల్లీస్‌(దక్షిణాఫ్రికా) 62 లు కోహ్లీ కంటే ముందు వరుసలో ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates