బుగ్గ గిల్లటం తప్పే..క్షమాపణ చెప్పిన గవర్నర్

governorవివాదంలో చిక్కుకున్నాడు తమిళనాడు గవర్నర్‌ బన్వారీలాల్‌ పురోహిత్‌. మంగళవారం (ఏప్రిల్-17) సాయంత్రం ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఓ మహిళా విలేకరి చెంపను నిమిరాడు. ఇది సంఘటన వివాదం అయ్యింది. రాజ్‌భవన్‌లో విలేకరుల సమావేశం ముగిసిన తర్వాత.. 78 ఏళ్ల గవర్నర్ బన్వారీలాల్‌ తనకు నిర్మలాదేవి ఎవరో తెలియదని వెల్లడించారు. అయితే సమావేశం అయిపోయి వేదిక దిగి కిందకు వెళ్లేప్పుడు ఓ మహిళా విలేకరి‌ ప్రశ్న అడగగా ఆయన సమాధానం చెప్పకుండా ఆమె చెంపపై తాకారు. దీంతో దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్న క్రమంలో గవర్నర్ స్పందించారు. మహిళా జర్నలిస్టుకు క్షమాపణ చెబుతూ ట్విట్టర్ లో ఓ లెటర్ పోస్ట్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates