మరో శుభవార్త : 863 గురుకుల పోస్టుల భర్తీకి అనుమతి

gurukulగిరిజన గురుకుల డిగ్రీ కాలేజీలకు కొత్త పోస్టులు మంజూరయ్యాయి. గురుకుల డిగ్రీ కాలేజీల్లో 863 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. 616 లెక్చరర్లు, 15 ప్రిన్సిపాల్ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. వీటితోపాటు ఆయా గురుకుల డిగ్రీ కాలేజీల్లో ఉన్న ఇతర సిబ్బంది నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఉద్యోగాలను గురుకుల బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మేరక ఉత్తర్వులు జారీ చేసింది ప్రభత్వం. త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్, పరీక్షా విధానం షెడ్యూల్ ప్రకటించనున్నారు. వీలైనంత త్వరగానే వీటి భర్తీకి చర్యలు చేపట్టాలని గురుకుల బోర్డును ఆదేశించింది ప్రభుత్వం. ఆర్థిక శాఖ క్లియరెన్స్ కూడా లభించటంతో.. నోటిఫికేషన్ వేయటమే మిగిలి ఉంది.

Posted in Uncategorized

Latest Updates