మరో స్కామ్: 800 కోట్లతో ” విక్రమ్ కొఠారీ” జంప్

modiమరో బ్యాంక్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దేశంలో రెండో అతి పెద్ద బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 11 వేల కోట్ల కుంభకోణం బయటపడిన కొన్ని రోజుల్లోనే మరో కుంభకోణం బయటపడటం ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేస్తుంది. మొన్న విజయ్ మాల్యా , నిన్న నిరవ్ మోడీ అయితే ఇప్పుడు అదే జాబితాలోకి మరో వ్యక్తి చేరాఢు. అతడే రొటొమాక్ పెన్స్ అధినేత విక్రమ్ కొఠారీ. ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 800 కోట్లకుపైగా అప్పులు తీసుకున్న కొఠారీ.. వాటిని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడు. అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల దగ్గర కొఠారీ ఈ లోన్లు తీసుకున్నాడు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర రూ.485 కోట్లు, అలహాబాద్ బ్యాంక్ నుంచి రూ.352 కోట్లు కొఠారీ తీసుకున్నాడు. ఏడాది తర్వాత కూడా అతను కనీసం వడ్డీ కూడా కట్టలేదు. వారం రోజులుగా కాన్పూర్‌లోని కొఠారీ ఆఫీస్‌కు తాళాలు వేసి ఉన్నాయి. అతను కూడా దేశం వదిలి పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. కొఠారీ ఆస్తులను అమ్మి ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని అలహాబాద్ బ్యాంక్ మేనేజర్ రాజేష్ గుప్తా తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates