మరో 116 మంది పోలీసులకు కరోనా

  • ఇద్దరు మృతి

ముంబై: మహారాష్ట్రలో పోలీస్ విభాగంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 116 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయింది. దీంతో రాష్ట్రంలోని మొత్తం పోలీసు వర్గాల్లో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 2,211 కు పెరిగింది. 73 మంది సిబ్బంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయంలోగా బాంద్రా, దాహిసర్ పీఎస్ ల పరిధిలోని ఇద్దరు పోలీసు సిబ్బంది చనిపోగా.. మహమ్మారి కారణంగా రాష్ట్రంలో మరణించిన పోలీసులు సంఖ్య 25 కు పెరిగింది. ఈ మేరకు మహారాష్ట్ర పోలీసు వర్గాలు గురువారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించాయి. అంతకుమందు రోజు కూడా రాష్ట్రంలో ఒకే రోజు 131 మంది పోలీసు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. కరోనా ఇన్ఫెక్షన్ కేసుల్లో మహారాష్ట్ర దేశంలోనే టాప్ లో ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటిదాకా 56,948 కేసులు నమోదయ్యాయి. 1,897 మంది చనిపోయారు. 2.190 మంది కోలుకున్నారు.

Latest Updates