మరో JNU ఫ్రొఫెసర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు

ఢిల్లీలోని జవహర్‌ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNTU)లో మరో ప్రొఫెసర్‌ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ లో విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ తనను లైంగిక వేధింపులకు గురిచేయడమే కాకుండా, బెదిరించారని ఓ మహిళా పీహెచ్‌ డీ స్కాలర్‌ ఢిల్లీలోని వసంత్ కంజ్ పోలీస్ స్టేషన్ లో కంఫ్లెయింట్ చేశారు. చాలాకాలం నుంచి ఇలానే వేధిస్తున్నాడని, కొన్ని రోజులుగా వేధింపులు అధికం కావడంతో కంఫ్లెయింట్ చేసినట్లు ఆ విద్యార్థిని తెలిపారు. ఈమేరకు శనివారం(ఏప్రిల్-14) ప్రొఫెసర్‌ పై IPC సెక్షన్ 354,506,509 ల కింద కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. ఫ్రొఫెసర్ లైంగిక వేధింపులపై యూనివర్శిటీ విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. JNU ప్రొఫెసర్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని గత నెలలో 8 మంది విద్యార్థినుల కంఫ్లెయింట్ తో ఓ ఫ్రొఫెసర్ ను పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత కోర్టు అతడికి బెయిల్ ముంజూరు చేసిన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates