మలేషియా మాజీ ప్రధాని అరెస్ట్

NAZమలేషియా మాజీ ప్రధామంత్రి నజీబ్ రజాక్ అరెస్ట్ అయ్యారు. స్ధానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 2: 35 గంటల సమయంలో కౌలంలంపూర్ లోని నజీబ్ నివసం.. తమన్ దుత్తాకు చేరుకున్న పోలీసులు నజీబ్ ను అదుపులోకి తీసుకున్నారు. రేపు ఉదయం 8:30గంటల సమయంలో నజీబ్ ను కోర్టులో హాజరుపర్చనున్నారు. మలేషియాకు చెందిన 1MBD కంపెనీ కుంభకోణంలో నజీబ్ రజాక్ పాత్ర ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అతడి ఇంట్లో వారం రోజుల క్రితం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో వేల కోట్ల సంపదను అధికారులు గుర్తించారు. ఖరీదైన కార్లు, లగ్జర్లీ వాచ్ లు, కోట్లు విలువచేసే డైమండ్ నక్లెస్ లు, వందల కొద్దీ వజ్రాలు, వందల కోట్లలో నగదును పోలీసులు స్వాధినం చేసుకున్నారు. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే నజీబ్, అతడి భార్య పాస్ పోర్ట్ ని తాత్కాలికంగా సీజ్ చేశారు. అయితే సోదాల్లో బయటపడినవన్నీ తాను ప్రధానమంత్రిగా పదవీకాలంలో ఉన్నప్పుడు తనకు గిఫ్ట్ గా వచ్చినవే అని నజీబ్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates