మలేసియా ప్రధానితో మోడీ సమావేశం

MODIప్రధాని మోడీ గురువారం (మే-31) మలేసియా ప్రధానితో భేటీ అయ్యారు. మూడు దేశాల పర్యటనలో ఉన్న మోడీ.. గురువారం మలేసియా చేరుకున్నారు. ఈ ఉదయం కౌలాలంపూర్‌ చేరుకున్న మోడీకి ఆ దేశ అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి పుత్రజయ వెళ్లి మలేసియా కొత్త ప్రధాని మహతీర్‌ మహ్మద్‌ ను కలిశారు.ఈ సందర్భంగా.. ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. ప్రధానిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన మహతీర్‌ కు అభినందనలు తెలియజేశారు మోడీ. ఆ తర్వాత ఇరు దేశాలకు సంబంధించిన చర్చలు జరిపారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా మోడీ బుధవారం (మే-30) ఇండోనేషియాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ దేశాధ్యక్షుడు జోకో విడోడోతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. అక్కడి నుంచి సింగపూర్‌ బయల్దేరిన ప్రధాని మోడీ.. మధ్యలో మలేసియాలో ఆగారు. మలేసియా నూతన ప్రధాని మహతీర్‌ ను అభినందించేందుకు మోడీ ప్రత్యేకంగా అక్కడికి వెళ్లారు. కౌలాలంపూర్‌ నుంచి మోడీ సింగపూర్‌ వెళ్తారు. శుక్రవారం (జూన్-1) షాంగ్రీ -లా డైలాగ్‌ లో జరగబోయే వార్షిక భద్రత సదస్సులో కీలక ప్రసంగం చేయనున్న మోడీ.. అనంతరం తన పర్యటన ముగించుకుని ఢిల్లీకి తిరిగివస్తారు.

Posted in Uncategorized

Latest Updates